A tribute to the Young kids who decimated their own lives

ఆలోచనని,వివేకాన్ని,వ్యక్తిగత స్వాతంత్రాన్ని,సమాజిక సమానత్వాన్ని ఇచ్చేది విద్య — ఇది మనం నేర్చుకున్నది.

నాలుగు గోడల మధ్య బంధించి ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు స్టడీ అవర్స్ పేరుతో పసి మేధస్సుని చిదిమేయటం  — ఇది  మన రేపటి తరం నేర్చుకుంటున్న విద్య.

బండకేసి రుద్దిన చేపలో ఎంత జీవం ఉంటుందో, రెండేళ్ళు ఒక కార్పోరేట్ కళాశాలలో ఇంటెర్మీడియెట్ కఠిన కారాగారం అనుభవించిన పసి మేధస్సులో అంతే జీవం మిగులుతుంది.ఇంకేంటి వాడు ఆలోచించేది? ప్రపంచ పొటీలో నిలబడేది?

ప్రపంచానికి కావలిసింది ఎంత త్వరగా చేస్తున్నాము అని మాత్రమే కాదు ఎంత ఉపయోగపడేలా చేస్తున్నాము అని!!

లోకం పరుగెడుతుంది! మీరూ పరుగెత్తండి!! పరుగెత్తాలి!!!“అంటారు.పరుగెత్తేవాడి ఒంటి మీద బట్టల బరువు తప్ప ఏముంటదండీ!ఒకడి కాళ్ళకి చేతులకీ గుది బండలు కట్టి పరిగెత్తమంటే ఏం పరుగెడతాడు??.పరుగెత్తలేక కొందరు,పరుగెత్తలేమేమో అని మరికొందరు,పరుగెడతారు అని వాళ్ళ తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకం నిలపెట్టలేకపోతున్నాము అని ఇంకొందరు తనువు చాలిస్తున్నారు.రేపటి తరం సీలింగ్ ఫ్యాన్ కి వేలాడుతూనో, ఏదో పాయిసన్ తాగుతూనో, రైలు పట్టాల కిందో ,నదీ జలాల కిందో విశ్రాంతి తీసుకుంటుంది.ఎవరైనా చనిపోయాక కాసేపు హడావిడి చేసి విషయాన్ని చనిపోయిన వాళ్ళతో పాటు సమాధి చేయటం మన  ఆధునిక  సమాజ పోకడ.

విద్య ఒక వ్యాపారం.విద్యకి విలువ కట్టి డబ్బులు ఇస్తా!” అన్నాడట ఒక ప్రబుధ్ధుడు.విలువనూ,విలువ కట్టటాన్నీ నేర్పేదే విద్య కదండీ!విలువ కట్టడం నేర్పించేదాని విలువ కడతా అని వచ్చే వీడెవడు??విద్యార్థుల ఆత్మహత్యలు ఒకడికి రాజకీయ పార్టీ ఉనికి చాటుకునే మార్గం ,ఉంకొకడికి ఛానల్ రేటింగ్స్ పెంచుకునే వస్తువు–అంతే!!

ఆధునిక విశ్రుంఖలత్వంతో సమాజంలో విలువలు చచ్చాయ్. విద్య ఇంకా బతికే ఉందిగా, ఏదో మూల మళ్ళీ మొలకెత్తుతాయ్, చిగురిస్తాయ్ అనుకుంటే విద్యని నిర్వీర్యం చేసి సజీవ శవం చేస్తామంటే ఒప్పుకుంటామా? ఒప్పుకోమంటారా?
విలువలూ లేక మేధస్సూ లేక భవిష్యత్తు తరాన్ని ఏమి చేయమందాం?

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s